హ్యాపీనెస్

Samanta Akkineni
Samanta Akkineni

స్టార్ హీరోయిన్ సమంతా ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి స్పెయిన్ దేశంలో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెల్సిందే.  ఈ ట్రిప్ లోనే సామ్ మామగారు అక్కినేని నాగార్జున 60 బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా జరిగాయి.  ఒక వైపు భర్త  చైతు కుటుంబ సభ్యులు.. మరోవైపు ఫ్రెండ్స్ తో సామ్ హడావుడి మామూలుగా లేదు.  సామాజిక మాధ్యమాల్లో సామ్ మహా జోరు చూపిస్తుంది.  అప్డేట్ల మీద అప్డేట్లు ఇస్తూ ఫాలోయర్లను థ్రిల్ చేస్తూ ఉంటుంది.  ఈ ట్రిప్ మొదలైన రోజు నుండి ఇప్పటివరకూ ఎన్నో ఫోటోలను షేర్ చేసిన సామ్ తాజాగా రెండు ఫోటోలను పోస్ట్ చేసింది.
ఈ ఫోటోలకు “ఆల్ గుడ్ థింగ్స్ మస్ట్ కమ్ ఫ్రమ్ వితిన్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  “అన్నీ మంచి విషయాలు లోపలనుంచి రావాలి”.. ఇది ఆ కొటేషన్.  చూసేందుకు చాలా సింపుల్ గా ఉన్నా ఇది చాలా లోతైన అర్థం ఉన్న క్యాప్షన్.