‘సారే జహాసే అచ్చా’..

బాలీవుడ్‌ స్టార్‌హీరో సల్మాన్‌ వీడియో వైరల్‌

salman khan video-‘Saare Jahaase Achcha’ ..

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తితో కూడిన పాటను పాడి అందరి దృష్టిని ఆకర్షించారు..

ప్రముఖ నిర్మాత అతుల్‌ అగ్నిహోత్రి సోషల్‌మీడియా ద్వారా ఈ వీడియోను విడుదల చేశారు. వీడియోలో సారే జహాసే అచ్చా..పాటను స్వయంగా సల్మాన్‌ ఖాన్‌ పడటం జరిగింది. వీడియో చివర్లో సల్మాన్‌ కన్పించారు..

జాతీయ జెండా చివర్లో రావటంతోపాటు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పేర్కొనటం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

ప్రస్తుతం ఆయన పూర్తిగా తన ఫామ్‌హౌస్‌కు పరిమితం అయ్యారు. అయినా కూడ దేశభక్తితో సారే జహాసే అచ్చా..

పాడటం నిజంగా అభినందనీయం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఆయన అభిమానులు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/