25 వేల మంది సినీ కార్మికులకు సల్మాన్ ఆర్థికసాయం

కార్మికుల అకౌంట్స్ లోకి డబ్బులు జమ

Salman Khan donates

Mumbai: దేశవ్యాప్తంగా లాక్ డౌన్     నేపథ్యంలో  చిత్ర పరిశ్రమలో పనిచేసే కళాకారుల పరిస్థితి కూడా దయనీయంగా మారింది.

అలాంటి వారికి సహాయం అందించేందుకు సినీ ప్రముఖులు ముందుకు రావాలని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (ఎఫ్డబ్ల్యూఐసి) అధికార ప్రతినిధి బీఎన్ తివారీ కోరాడు. ఈ అప్పీలుకి  బాలీవుడ్ నటుడుడ  సల్మాన్ ఖాన్   వెంటనే స్పందించాడు.

అతను  గొప్ప సాయమే చేయబోతున్నాడు. తన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ద్వారా సల్మాన్ హిందీ సినీ పరిశ్రమలో పని చేసే డైలీ  వర్కర్లందరికీ ఆర్థిక సహాయం అందించబోతున్నాడు. 25 వేల మంది కళాకారులకు సల్మాన్ నేరుగా అకౌంట్లలో డబ్బులు వేయనున్నాడు.

ఈ మేరకు వారి అకౌంట్ల వివరాల లిస్టును సల్మాన్ కు   పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. లాక్ డౌన్ ఉన్నంత కాలం సినీ కార్మికులెవ్వరూ తిండికి ఇతర అవసరాలకు బాధ పడాల్సిన పని లేదని.. వారిని తాను ఆదుకుంటానని సల్మాన్ ప్రకటించాడు.

తాప్సీ పన్ను.. కరణ్ జోహార్ వంటి ప్రముఖులు సైతం సినీ కార్మికులకు సాయం అందించేందుకు ముందుకొచ్చారు.

25 వేల మందికి ఆర్థిక సాయం అంటే సల్మాన్ వితరణ కోట్లల్లోనే ఉండబోతోంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/