‘సకల కళా వల్లభుడు’ సిద్ధం

SAKALA KALA VALLABUDU---
SAKALA KALA VALLABUDU—

‘సకల కళా వల్లభుడు’ సిద్ధం

సుబ్రహ్మణ్యంపు వంటి హిట్‌ చిత్రం నిర్మాత బీరం సుధాకర్‌రెడ్డి సమర్పణలో సింహఫిలింస్‌ , దీపాల ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం సకల కళావల్లభుడు.. ఈచిత్రానికి తనిష్క్‌ రెడ్డి, మేఘ్లా ముక్తా హీరోహీరోయిన్లుగా నటించారు.. శివగణేష్‌ దర్శకత్వం వహించారు..ఈచిత్రం ఫిబ్రవరి1న విడుదల కాబోతోంది.. ఈసందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ , కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈచిత్రాన్ని ఫిబ్రవరి 1న విడుదల చేయనున్నామన్నారు.. ఈచిత్రానికి హీరో పెర్ఫామెన్స్‌ , కథ, కథనాలు హైలెట్‌గా నిలుస్తాయన్నారు..ఇంటర్వెల్‌ తర్వాత ఒక సన్నివేశం ఉత్కంఠ రేపుతుందన్నారు. గ్రౌండ్‌ స్కోర్‌ప్రధాన ఆకరషణగా తెలిపారు. దర్శకుడు శివ గణేష్‌ మాట్లాడుతూ, ఒక హిట్‌ చిత్రానికి కావాల్సిన ఎలిమెంట్స్‌ అన్నీ ఈచిత్రానికి కుదిరాయని తెలిపారు. అజ§్‌ు పట్నాయక్‌ సంగీతం అందించారని తెలిపారు.. పృధ్వీ, జీవా కామెడీ సన్నివేశాలున్నాయని, ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో పృధ్వీ మేనరిజమ్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు..