రాజమౌళికి జీవితాంతం రుణపడిఉంటా:

 RRR Team with Media
DVV Danaiah, Actors NTR, Ramchana, Director Rajamouli
  • ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రెస్‌మీట్‌లో నిర్మాత డివివి దానయ్య

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో శ్రీమతి పార్వతి సమర్పణలో డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌.. ప్రస్తుతం చిత్రీకరణ దశలోఉంది.. ఈసినిమా విశేషాలను తెలియజేసేందుకు మీడియాతో మాట్లాడారు.. రాజమౌళి మాట్లాడుతూ, తాను ఎప్పుడూ ఆడియెన్స్‌కు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌ రాబోతుదని ముందేచెప్పటానికి ట్రైచేస్తుంటానని అన్నారు.. సాధారణంగా షూటింగ్‌ స్టార్ట్‌కుముందే అలాంటి విషయానొన నిర్వహిస్తానని అన్నారు. ఇది మనకు తెలిసినస్టోరీ కాదని, తెలియని స్టోరీ అన్నారు..ఫిక్షియస్‌ స్టోరీ అన్నారు.. కంప్లీట్‌గా ఫిక్షనల్‌ స్టోరీ అది కూడ మనకు తెలిసిన ఇద్దరురియల్‌ హీరోస్‌ గురించి చెప్పటమే ఈ సినిమా అన్నారు.. 19వ దశాబ్దంలో జరిగిన కథ అన్నారు.. ఉత్తర భారతదేశంలోజరిగిన కథ అని చాలా రీసెర్చ్‌ చేయాల్సి వచ్చిందన్నారు.. రామ్‌చరణ్‌ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టులోపార్ట్‌ కావటం చాలా హ్యాపీగా అన్పించిందన్నారు..ఇండస్ట్రీలో బెస్ట్‌ఫ్రెండ్‌, దగ్గరైన వ్యక్తి చాలా చాలా నచ్చే వ్యక్తి తారక్‌తో, మాకు బాగా తెలిసిన దానయ్యగారితో పనిచేయటం ఆనందంగా ఉందన్నారు.. నేను తారక్‌తో వర్క్‌ చేయటాన్ని ఎంజా§్‌ు చేస్తున్నానని అనానరు.. మా ఇద్దరి షెడ్యూల్స్‌ ఇంకా స్టార్ట్‌ కాలేదని, నేను నా బ్రదర్‌ తారక్‌తో పనిచేయటానికి ఎదురుచూస్తున్నానని అన్నారు. యంగ్‌ టైగర్‌ఎన్టీఆర్‌ మాట్లాడుతూ, జక్కన్నతోఇది నాలుగోచిత్రమన్నారు. అన్నింటి కంటే ఇదొక స్పెషల్‌ మూవీగా నా కెరీర్‌లో మిగిలిపోతుందన్నారు.. అంతేకాకుండా చరణ్‌తోనటించటం, మా ఇద్దరి బాండింగ్‌ ఈచిత్రంతో మొదలవలేదని, నాకు తెలిసిన ఓమంచి మిత్రుడు నా కష్టసుఖాలు పంచుకునే స్నేహం ఉన్న మిత్రుడు ఈసినిమాలోపనిచేయడానికంటే ముందే ఈ బాండింగ్‌ ఎప్పుడైతే ఏర్పడిందో అది చిత్రంలోకి వచ్చేసరికి ఈసినిమాలోకలిసి పనిచేసే సరికి మా బాండింగ్‌ వేరే లెవల్‌కు వెళ్లిపోయింది.. ఈ స్నేహం ఇలాగే ఉండిపోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానని అన్నారు.
నిర్మాత దానయ్య మాట్లాడుతూ, భారతదేశం గర్వించే దర్శకులు రాజమౌళిగారితో ఈసినిమా చేయటం నా పూర్వజన్మ సుకృతమో, నా భార్య , పిల్లల అదృష్టం తెలియదు..రెండు పెద్ద ఫ్యామిలీస్‌తో వచ్చిన ఇద్దరుసమ ఉజ్జీలైన హీరోలతో ఈసినిమా చేసే అవకాశం కల్పించిన రాజమౌళిగారికి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు..ఈసినిమాను 2020 జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయస్తున్నామని తెలిపారు. .అదేవిధంగా 10 ఇండియన్‌ లాంగ్వేజెస్‌లో ఈసినిమాను విడుదల చేయాలనే ఉద్దేశ్యం ఉందన్నారు.