సిఎం కెసిఆర్‌పై రాంగోపాల్‌వర్మ ప్రశంసలు

Ram Gopal Varma and KCR
Ram Gopal Varma and KCR

అమరావతి: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ మంగళవారం మాజీ సిఎం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా విజయవాడ పైపులరోడ్డు వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలదండవేసి నివాళి ఆర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతు తాను ఇప్పటివరకు చూసిన సిఎంలల్లో తెలంగాణ సిఎం కెసిఆర్‌ బెస్ట్‌ సిఎం అని రాంగోపాల్‌ ప్రశంసించారు. అయితే గతంలో ఇదే ప్రాంతానికి రావడానికి తాను ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొన్నానని, ఆ అడ్డంకులన్నింటినీ స్వర్గీయ ఎన్టీఆర్ తప్పిస్తూ వచ్చారని, అందులో ఒక భాగమే చంద్రబాబు ఓటమి అని పేర్కొన్నారు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు తన తదుపరి సినిమా అని వెల్లడించారు.


తాజా సినిమా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/