ర్యాంప్ వాక్ అదరహో!

Rakul Preet singh
Rakul Preet singh

సోషల్ మీడియాలో రకుల్ స్పీడు మామూలుగా ఉండదు. ఫోటో షూట్లు చేయడం.. ఫోటోలు పోస్ట్ చేయడం.. లైకులు కొట్టించుకోవడం రకుల్ కు వెన్నతో పెట్టిన విద్య.  
తాజాగా మరోసారి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటో #హెయిర్ అండ్ బియాండ్ 2019 కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో తీసిందట. సదరు ఈవెంట్ గురించి చెప్తూ “మీరు దాన్ని #రెట్రో రీమిక్స్ కలెక్షన్ అనవచ్చు.  కానీ నేను దాన్ని టైమ్ ట్రావెలింగ్ అంటాను.  #హెయిర్ అండ్ బియాండ్ 2019 లో పాల్గోనడం.. అప్పటి తరానికి సంబంధించిన ఫ్యాషన్ ను మరోసారి గుర్తు చేసుకోవడం ఒక అద్భుతమైన అనుభవం.  నాకు స్క్రంచ్డ్ పెకన్ కర్ల్స్ హెయిర్ స్టైల్ చేసినందుకు థ్యాంక్ యూ” అంటూ తన అనుభవాన్ని వివరించింది.
క్యాప్షన్ లో చెప్పినట్టుగా హెయిర్ స్టైల్ నిజంగానే వెరైటీగా ఉంది.  జస్ట్ హెయిర్ స్టైల్ మాత్రమే కాదు. బ్రౌన్ కలర్ థై స్లిట్ గౌన్ లో ఒక ఇంటర్నేషనల్ మోడల్ తరహాలో ర్యాంప్ వాక్ కూడా చేసింది.  స్లీవ్ లెస్.. డీప్ వీ నెక్ గౌన్ కావడంతో హాటు హాటర్ హాటెస్ట్ అనిపిస్తోంది.  ఈ ఫోటోకు “డ్రెస్.. హెయిర్ స్టైల్ రెండూ సూపర్”.. “ర్యాంపుపై సెక్సీ లేడీ”.. “సింప్లీ స్టన్నింగ్ బ్యూటీ” అంటూ నెటిజన్లు కత్తిలాంటి కామెంట్లు పెట్టారు