మన్మథుడు 2 సరసన

rakul preet singh
rakul preet singh

యాక్టర్‌ కం డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో నాగార్జున కెరీర్‌లో క్లాసిక్‌గా నిలిచిన మన్మథుడు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం మన్మథుడు2.. ఈసినిమాలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటించనుందని తెలిసింది. రకుల్‌ కోసం బిందాస్‌ గా ఉండే ఒక ఇంట్రెస్టింగ్‌ యువతి పాత్రను డిజైన్‌ చేశాడట దర్శకుడు.. నటనకు మంచి స్కోప్‌ ఉండే పాత్ర అని..రకుల్‌ క్యారెక్టరైజేషన్‌ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని టాక్‌.. ఈచిత్రాన్ని నాగార్జున స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈనెలాఖరులోనే సినిమాను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి..