అత్తివరదరాజస్వామిని దర్శించుకున్న రజనీకాంత్‌

  • నలభై ఏళ్లకు ఒకసారి లభించే స్వామి దర్శన భాగ్యం
Rajinikanth - Athi Varadaraja Swamy Temple
Rajinikanth – Athi Varadaraja Swamy Temple

కాంచీపురం: ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ ఈ రోజు తెల్లవారు జామున కుటుంబ సమేతంగా తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని అత్తివరదరాజస్వామిని దర్శించుకున్నారు. నలభై ఏళ్లపాటు నీటిలో ఉండి కేవలం 48 రోజులు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే అత్తివరదరాజస్వామి 1979లో స్వామి దర్శనం లభించగా, ఇన్నేళ్ల తర్వాత ఈ ఏడాది అటువంటి అరుదైన అవకాశం వచ్చింది. వారం క్రితం రజనీ భార్య లత ఒక్కరే స్వామిని దర్శించుకోగా తాజాగా దంపతులు ఇద్దరూ కలిసి దర్శించుకున్నారు. రజనీ దంపతులకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలకగా, అర్చకులు ప్రత్యేక దర్శనం కల్పించారు. ఆగస్టు 17 వరకు స్వామి దర్శనం భక్తులకు లభిస్తుంది. ఆగస్టు 18వ తేదీన తిరిగి స్వామిని పుష్కరిణిలో దాచిపెడతారు. మరో నాలుగు రోజులే సమయం ఉండడంతో స్వామి దర్శనానికి తండోపతండాలుగా తరలివస్తున్న దేశ, విదేశీ భక్తులతో కాంచీపురం కిటకిటలాడుతోంది.


తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/tours/