రానా ‘హిరణ్య కశ్యప’

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ దర్శకత్వంలో రానా ప్రధానపాత్రగా హిరణ్య కశ్యప అనే భారీ పౌరాణిక చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే.. కాగా ఈసినిమా సమ్మర్‌: నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది.. రానా ప్రస్తుతం చేస్తున విరాటపర్వం మరో నెలరోజుల్లో పూర్తికానుంది.. ఆ తర్వాత నుండి హిరణ్య కశ్యప చిత్రంపైనే ఆనే దృష్టిసారించనున్నారట.. ఈ చిత్రంలో విఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ అధికంగా ఉండటం కారణ:గా ఈసినిమాను 150 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తీయనున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులతోపాటు షాట్‌ డివిజన్‌, ఫొటో గ్రఫీ తో సహా బౌండ్‌ స్క్రిప్టును పూర్తిగా రెడీ చేస్తోంది టీం..
సురేష్‌ప్రొడక్షన్స్‌ ఈసినిమాను నిర్మిస్తోంది.. హిరణ్య కశ్యపుడు, భక్తప్రహ్లాదల కథ ఆధారంగా ఈచిత్రం రూపొందనుంది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/