“ఇది నిజంగా చీరేనా?”

Priyanka-Chopra-Wear-Different-Saree

ప్రియాంక అసలే గ్లోబల్ సుందరి.. అందుకే తన ఇమేజ్ ను ఏదో ఒకరకంగా పెంచుకుంటూనే ఉంది.  మెట్ గాలాలు.. కేన్స్.. లాంటి ఈవెంట్స్ లో తన వస్త్రధారణతో ఫ్యాషన్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంటుంది.  అవేమీ లేకపోయినా మ్యాగజైన్ కవర్ పేజిలపై మెరుస్తూ అభిమానులను మురిపిస్తూ ఉంటుంది.  రీసేంట్ గా ప్రియాంక ఇన్ స్టైల్ మ్యాగజైన్ కోసం ఒక ఫోటో షూట్ చేసింది. బికినీలు..మొనోకినిలు.. డెనిమ్ లు.. కాకుండా లేడీ ఇండియన్స్ డ్రెస్ అయిన చీరను ధరించి ఈ ఫోటోషూట్ లో పాల్గొంది. ఈ చీరను ప్రత్యేకంగా డిజైన్ చేసినవారు సబ్యసాచి ముఖర్జీ. ఆయన ఇండియాలో ఈ చీరను ప్రత్యేకంగా డిజైన్ చేసి అమెరికాకు పంపారట.

చీరను డిజైన్ చేశారంటేనే అది మామూలు వ్యవహారం కాదని మీకు అర్థం అయిపోయిఉండాలి. మామూలు చీర అయితే ప్రియాంక స్పెషల్ ఏముంది. అందుకే డిఫరెంట్ గా ఉంది.  ఇక దాన్ని బ్లౌజ్ అనాలో లేక కాల్విన్ క్లెయిన్ వారి అంతః సౌందర్యం దుస్తులు అనాలో అర్థం కావడంలేదు. కానీ దానివల్లే కాస్తైనా గ్లామర్ షో ఉంది. ఈ లైట్ గ్రీన్ కలర్ చీరకు ఒడ్డాణం కూడా పెట్టుకుంది. పచ్చటి చెట్ల మధ్యలో నిలబడడంతో వనదేవతలాగా కనిపిస్తోంది. మ్యాచింగ్ లిప్ స్టిక్ తో.. వేలికి ఉంగరంతో ప్రియాంక తన స్టైలింగ్ ను పూర్తి చేసింది. దీనికి నెటిజనులు చాలా కామెంట్లు పెట్టారు. “తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్”.. “స్టన్నింగ్ మోడరన్ శారీ”.. “గార్జియస్ లేడీ” అంటూ పొగడ్తలు గుప్పించారు. ఒక నెటిజనుడికి మాత్రం అనుమానం వచ్చింది “ఇది నిజంగా చీరేనా?” అని ప్రశ్నించాడు. ఇంకొకరికి అసలు నచ్చలేదు.. “ఇది ఫకీర్ కా జుబ్బా” అన్నాడు.