స్పెషల్ డిజైనర్ డ్రెస్ లో

Priyanka chopra Latest Pic
Priyanka chopra Latest Pic

అమెరికా కోడలు ప్రియాంక చోప్రా స్టైలింగ్ గురించి.. ఫ్యాషన్ అనుకరణ గురించి చెప్పాల్సిన పనే లేదు. హాలీవుడ్ టు బాలీవుడ్ ప్రతి ఒక్కరూ తనని ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఈ భామ న్యూయార్క్ లో మామ్ మధు చోప్రాతో కలిసి షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హబ్బీ నిక్ జోనాస్ టూర్ ముగించుకుని తిరిగి పీసీతో  షికార్లలో జాయిన్ అయ్యాడు. అతిథి అనుపమ్ ఖేర్ తో కలిసి నిక్ జోనాస్  సంగీత కచేరీ ముగించుకున్న తరువాత.. పీసీ – నిక్ జంట ఓ యాచ్ డేట్ కి బయలుదేరారని తెలుస్తోంది. నదిలో పడవ విహారం ముగిశాక పీసీ తిరిగి న్యూయార్క్ వీధుల్లో విహరించింది. ఫ్యాషన్ అండ్ స్టైల్స్ లో పీసీ హాలీవుడ్ రేంజుకు ఏమాత్రం తగ్గదన్న సంగతి తెలిసిదే. అక్కడ వీధుల్లో ప్రియాంక స్పెషల్ డిజైనర్ డ్రెస్ లో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది.
పీసీ హల్ చల్ ని ఇదిగో ఇలా స్నాప్ తీసి సామాజిక మాధ్యమాల్లో రిలీజ్ చేశారు. వైట్ అండ్ బ్లాక్ డిజైనర్ స్ట్రాప్ డ్రెస్ లో పీసీ హొయలు కేకలు పెట్టించేస్తోంది కదూ? స్పెషల్ డిజైనర్ దుస్తుల్లో.. తొడ భాగంలో చీలికతో ఆ లుక్కే సంథింగ్ స్పెషల్ గా కనువిందు చేస్తోంది.
ఇంతకీ పీసీ న్యూయార్క్ విహారం విశేషమేమిటి అంటే.. ఈ రోజు యుఎస్ ఓపెన్ 2019 మ్యాచ్ జరగనుంది.  తల్లి మధు చోప్రాతో కలిసి పీసీ ఇలా స్టేడియమ్ కి వెళ్లిందట. సెరెనా విలియమ్స్ అభిమానిగా అక్కడ ఆ ఇద్దరూ మ్యాచ్ వీక్షించనున్నారట. ఈలోగానే రోడ్ పై వెళుతుంటే ఫోటోలు తీశారు. ఈ ఫోటోల్లో పీసీ స్నేహితురాలు మేఘన్ మార్క్ లే మిస్ అయ్యింది.