ప్రభాస్‌ కొత్తసినిమా ఖరీదైన సెట్‌

Prabhas in New Movie Still
Prabhas in New Movie Still

ప్రభాస్‌ చాలా గ్యాప్‌ తర్వాత ఇటీవలే కొత్తసినిమా షూటింగ్‌ ప్రారంభించిన సంగతి విదితమే.. ఈషెడ్యూల్‌ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సెట్‌ నిర్మించారు. ఎంతోకష్టపడి నిర్మించిన ఈ సెట్‌లో చాలానేప్రత్యేకతలు ఉన్నాయని తెలిసింది. మొర్రాకో టైల్స్‌తో వేసి ఫ్లోరింగ్‌, యాంటిక్‌ పియానో, ఖరీదైన కార్పెట్స్‌ ఇలా సెట్‌ కోసం వాడిన సామాగ్రి అన్ని లావిష్‌గా ఉంటాయని తెలిసింది.. ఒక్క సెట్‌కోసం రూ.3కోట్లు వెచ్చించారని తెలిసింది.. ఈచ్తిరం 70ల్లో పిరియాడికల్‌ లవ్‌స్టోరీ కాదని, కానీ కొత్త తరహా ప్రేమకథ అని దర్శకుడు రాధాకృష్ణ చెబుతున్నారు.. హైదరాబాద్‌లో షెడ్యూల్‌ పూర్తికాగానే కొత్త షెడ్యూల్‌ కోసం ఆస్ట్రియా వెళ్లనుంది టీం. గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్‌పై కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈచిత్రాన్ని తెలుగుతోపాటు హిందీలో కూడ రూపొందించి ఇతర భాషల్లోకి అనువదిస్తారని సమాచారం.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/