జిమ్ కోచ్ కి రేంజ్ రోవర్ గిఫ్ట్!

అదీ డార్లింగ్ ప్రభాస్ రేంజ్!

prabhas-Range Rover gift to gym coach!
prabhas-Range Rover gift to gym coach!

ప్రభాస్.. నచ్చితే చాలు ఎలాంటి ఖరీదైన కానుక అయినా టకీమని కొనిచ్చేస్తాడు..ఇంతకుముందు శ్రద్ధా కపూర్ సాహో చిత్రంలో తన సరసన నటించేందుకు అంగీకరించినందుకే ఇంటి నుంచి 20 రకాల వెరైటీలతో క్యారేజీ రెడీ చేసి వడ్డించాడు.

ఆ తర్వాత ఖరీదైన కానుకలెన్నో ఇచ్చాడు. తన సాటి నాయికలకు చాలాసార్లు గిఫ్ట్ లు ఇచ్చినా దానిపై బయటికి అయితే ప్రకటించుకోడు ఈ సిగ్గరి అని చెబుతారు.

ఇక స్నేహితులకు అయితే లెక్కలేనన్ని కానుకలు ఇస్తూనే ఉంటాడు ప్రభాస్ రాజు…

prabhas-Range Rover gift to gym coach!

ఇప్పుడు ఖరీదైన రేంజ్ రోవర్ ని ఎవరికి కానుకిచ్చాడు? అంటే.. తనకు ఫిట్నెస్ ట్రైనర్ గా పని చేస్తున్న లక్ష్మణ్ రెడ్డికి కొనిచ్చేశారు డార్లింగ్.

ఈ కానుక చూసి అంతా ఔరా! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. తనకు నచ్చితే చాలు గిఫ్టిచ్చేస్తాడు. అందుకేగా ప్రభాస్ ని డార్లింగ్ అని పిలిచేది.

అతడి పెద్ద మనసు స్నేహ స్వభావం ఎంతో గొప్పవని తనతో కలిసి పని చేసిన వారు చెబుతుంటారు.

పేదలకు సాయం.. స్నేహితులకు కానుకలు ఇవన్నీ పరమ రొటీన్ తన జీవితంలో. ఇక లక్ష్మణ్ రెడ్డి సెలబ్రిటీ ట్రైనర్ గా ఫేజ్ 3 క్రౌడ్ కి సుపరిచితుడు. 

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/