‘సరిలేరు నీకెవ్వరు’ స్పెషల్ సాంగ్ కోసం..

Pooja Hegde in Mahesh Movie Special Song!
Pooja Hegde in Mahesh Movie Special Song!

‘సరిలేరు నీకెవ్వరు’ స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటివరకూ ఏ హీరోయిన్ ను కూడా ఫైనలైజ్ చేయలేదట. అయితే ఈ పాటకోసం బ్యూటిఫుల్ పూజా హెగ్డేతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారట.  రెమ్యూనరేషన్ గట్రా ఒకే అయితే పూజతో కలిసి మహేష్ స్టెప్స్ వేయడం కన్ఫాం అవుతుంది. స్పెషల్ సాంగ్స్ లో డ్యాన్స్ చేయడం పూజాకు కొత్తేమీ కాదు.  గతంలో ‘రంగస్థలం’ సినిమాలో చరణ్ తో కలిసి ‘జిగేలు రాణి’ కి ఆడిపాడిన విషయం తెలిసిందే.  ఆ పాట సూపర్ హిట్ కూడా అయ్యింది. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో స్పెషల్ అవకాశం వస్తే నో చెప్పే అవకాశం దాదాపుగా ఉండదు.  ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.