ఎన్నికల తర్వాతే ‘పీఎం నరేంద్రమోడి’ విడుదల

PM Modi Biopic Stopped By Election
PM Modi Biopic Stopped By Election

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘పీఎం నరేంద్రమోడి’ చిత్రం సార్వత్రిక సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేవరకూ సినిమాను విడుదల చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ చిత్రం వల్ల క్షేత్ర స్థాయిలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఈసీ తెలిపింది. అయితే ఈ చిత్రం రేపు ప్రేక్షకులు ముందుకు రావాల్సి ఉంది. సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఇందులో 11 సన్నివేశాలకు కత్తెర పడింది. విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్న సంభాషణల వద్ద బీప్‌ శబ్దం వినిపించనుంది. ఈ చిత్రం విడుదలకు ఈసీ అడ్డు చెప్పడంతో మే 19 తర్వాతే విడుదల కానుంది.


మరిన్ని తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/