డిస్కో రాజా జోడీ సెల్ఫీ

Payal Selfy with Ravi Teja
Payal Selfy with Ravi Teja

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వీఐ ‘డిస్కో రాజా’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  సైఫై టచ్ ఉండే ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.
ఈ సినిమాలో ‘RX 100’ ఫేమ్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈరోజు ‘డిస్కో రాజా’ షూటింగ్ లొకేషన్లో పాయల్ రాజ్ పుత్ ప్రత్యక్షమైంది.  ఈ సందర్భంగా రవితేజతో సెల్ఫీలు కూడా తీసుకుంది. ఈ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది.  అయితే పాయల్ ఇంకా షూటింగ్ లో పాల్గొనలేదట.  త్వరలోనే ‘డిస్కోరాజా’ టీమ్ తో జాయిన్ అవుతుందని సమాచారం.  ‘డిస్కోరాజా’ టీమ్ స్విట్జర్లాండ్ షెడ్యూల్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో పాయల్ మాస్ రాజాతో జాయిన్ అయ్యే అవకాశం ఉందట.
ఈ చిత్రాన్ని ఎస్ ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు.