కనకదుర్గమ్మను దర్శించుకున్న ‘ఓ బేబి’ చిత్ర బృందం

indrakeeladri
indrakeeladri

విజయవాడ: సినీ నటి సమంత బుధవారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆమెతో పాటు దర్శకురాలు నందినిరెడ్డి, హీరో తేజ, ఇతర చిత్ర బృందం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో కోటేశ్వరమ్మ అమ్మవారి చిత్రపటాన్ని వారికి అందించారు. సమంత మాట్లాడుతూ.. దర్గుమ్మని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఓ బేబి సినిమాని ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/