చిరు బయోపిక్‌ అవసరం లేదు

nagababu
nagababu


హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి జీవితాధారంగా బయోపిక్‌ తీయాల్సిన అవసరం లేదని మెగాబ్రదర్‌ నాగబాబు అంటున్నారు. ఓ సందర్భంగా పలు మీడియా వర్గాలతో ఆయన చిరు బయోపిక్‌ గురించి మాట్లాడారు. చిరుపై బయోపిక్‌ తీయాల్సిన అవసరం లేదని ,సినీ కెరీర్‌ ఆరంభంలోనే తను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అంతా విజయవంతమైన జీవితాన్నే గడిపాడు. కానీ, సావిత్రి, సిల్క్‌స్మిత ,సంజ§్‌ుదత్‌ల విషయంలో వారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కాని చిరు జీవితంలో అవేమి లేవు. కాబట్టి రామ్‌చరణ్‌ తన తండ్రి బయోపిక్‌ తీయకపోవడమే మంచిదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు నాగబాబు.

తాజా వీడియోల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/videos/