ఏప్రిల్‌లో ఓ ఇంటివాడవుతున్నాడు..!

NITIN
NITIN

యంగ్‌ హీరో నితిన్‌ పెళ్లికి సంబంధించి విఫయం బయటికి వచ్చింది.. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఓ ఇంటివాడు కాబోతున్నారని తెలిసింది.. కొంతకాలంగా ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్న నితిన్‌ ఆమెను పెళ్లిచేసుకోనున్నారట.. ఈమె చిత్ర పరిశ్రమకు చెందినవారు కాదని సమాచారం.. వచ్చేఏడాది ఏప్రిల్‌లో ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నారని తెలుస్తోంది.. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా ఉన్న నితిన్‌ను వివాహం చేసుకోనున్న ఆ లక్కీగర్ల్‌ ఎవరనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈఏడాది లాంబ్‌ బ్రేక్‌ తీసుకున్న నితిన్‌ వరుసగా నాలుగు సినిమాలు ప్రకటించారు.. దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న భీష, వెంకీ అట్లూరి దర్శకుడిగా రంగ్‌దే చిత్రాలు చేస్తున్న నితిన్‌ చంద్రశేఖర్‌ ఏలేటితో ఒకసినిమా, కృష్ణచైతన్య అనే దర్శకుడితో మరో సినిమా చేస్తునఆనరు.. వచ్చే ఏడాది నితిన్‌ నుంచి కనీసం మూడు సినిమాలు వచ్చే అవకాశం ఉంది..

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/