‘నిను వీడని నీడను నేనే’ సక్సెస్‌మీట్‌

NINU VEEDANI NEEDANI NENE
NINU VEEDANI NEEDANI NENE

సందీప్‌ కిషన్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం నిను వీడని నీడను నేనే.. అన్యాసింగ్‌ హీరోయిన్‌.. కార్తీక్‌రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్‌ ప్రొడక్షన్‌ నెం1, విస్టూడియోస్‌, విస్తా డ్రీమ్‌ మర్చంట్స్‌ పతాకాలపై సినిమా తెరకెక్కింది.. దయాన పన్నె,సందీప్‌కిషన్‌, విజిసుబ్రహ్మణ్యన్‌ నిర్మాతలు.. ఎస్‌ఎస్‌ థమన్‌ సంగీతం అందించారు. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనిల్‌సుంకర సమర్పణలో రూపొందిన ఈసినిమా శుక్రవారం విడుదలైంది..మంచి హిట్‌ టాక్‌ సాధించింది. ఈసందర్భంగా యూనిఠ్‌ సక్సెస్‌మీట్‌ నిర్వహించింది.. సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ, ఎంతోనమ్మి మేం ఈచిత్రాన్ని రూపొందించటం జరిగిందన్నారు.. మొదట టెన్షన్‌పడ్డానని, కానీ ప్రేక్షకులు అఖండమైన ఆదరణ ఇస్తున్నారన్నారు. చాలా రోజుల తర్వాత ఇవాళ ప్రశాంతంగా నిద్రపోతాను అని అన్నారు. అన్యాసింగ్‌ మాట్లాడâత, పాజిటివ్‌రివ్వూలు రావటంతో నా తొలితెలుగు సినిమా కాబట్టి హ్యాపీగాఉన్నానని తెలిపారు..కార్యక్రమంలో దయా పన్నెం మాట్లాడుతూ షోలు అన్నీ హౌస్‌ఫుల్‌ అవుతున్నాయని తెలిపారు. సోమవార నుంచి సక్సెస్‌టూర్‌కు వెళ్తున్నామని తెలిపారు. నిర్మాత సుప్రియ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు శివ చెర్రి, సీతారామ్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/