పెళ్లి ఆహ్వానం కొందరికే!

కోవిడ్‌ నిబంధనలే కారణం

Niharika -chaitanya
Niharika -chaitanya

మెగా డాటర్‌ నిహారిక త్వరలో పెళ్లిపీటలు ఎక్కనుంది.. తన కుమార్తె పెళ్లి గురించి నాగబాబు ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్య, నిహారికల పెళ్లి చేయటానికి ఇరుకుటుంబాల పెద్దలు నిర్ణయించారు.

ఇది తమ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం..నిశ్చితార్ధం, పెళ్లి ఇలా ఏ వేడుక చేసినా ప్రభుత్వ నిబంధనలు పాటించి చేస్తామని తెలిపారు.. హడావుడిగా పూర్తిచేయాలనుకోవటం లేదని అన్నారు.

వివిధ వర్గాల సమాచారం ప్రకారం..నిహారిక, చైతన్యల నిశ్ఛితార్ధం ఆగస్టు 13న జరిగే అవకాశం ఉందని తెలిసింది..

అయితే ఈపెళ్లికి చాలా కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం ఉంటుందని తెలిసింది.. సన్నిహిుతులకు మాత్రమే ఆహ్వానం ఉంటుందని నాగబాబు చెప్పటం జరిగింది..

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/