బీచ్ లో అందాల ‘నిధి’

Nidhi Agarwal Insta Pic
Nidhi Agarwal Insta Pic

తెలుగు ప్రేక్షకులకు ‘సవ్యసాచి’ మరియు ‘మిస్టర్ మజ్ను’ చిత్రాలతో దగ్గరయిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ తక్కువ సమయంలోనే ప్రేక్షకులు బాగా దగ్గర అయ్యింది. తన అందాలతో స్టార్ డం దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా ఉండే నిధి అగర్వాల్ తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో సూపర్ హిట్ గా నటించిన ఈ అమ్మడు తాజాగా ఒక స్టిల్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య మూడు మిలియన్స్ దాటిన సందర్బంగా ఈ ఫొటోను పోస్ట్ చేసింది. సముద్రపు ఒడ్డున సూపర్ హాట్ లుక్ కాస్ట్యూమ్స్ తో ఈ అమ్మడు రన్నింగ్ చేస్తున్న ఫొటోను పోస్ట్ చేసింది. బ్లూ అండ్ వైట్ డ్రస్ లో నిధి బీచ్ లో ఉన్న ఫొటో సూపర్బ్ గా ఉంది. ఈ ఫొటోకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. నిధి అగర్వాల్ నిజంగా అందాల నిధి లా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్ అయితే నిధి అగర్వాల్ దశ తిరిగినట్లే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందంతో పాటు మంచి నటన ప్రతిభ ఉన్న నిధి అగర్వాల్ టాలీవుడ్ లో భవిష్యత్తులో టాప్ హీరోయిన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.