ధనుష్‌ లాంటి హీరోలు అరుదు: నవీన్‌ చంద్ర

Naveen Chandra Statement
Naveen Chandra with Dhanush

నవీన్‌ చంద్ర అందాల రాక్షసితో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు.. హీరోగా చేస్తూనే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు.. ఈ క్రమంలో నవీన్‌ చంద్ర ప్రతి కోలీవుడ్‌లోనూ కన్పించబోతోది.. అక్కడి స్టార్‌ హీరో ధనుష్‌ హీరోగా నటిస్తున్న సినిమాలో నవీన్‌ చంద్ర ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.. కోలీవుడ్‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈచిత్రానికి దురై సెంథిల్‌ కుమార్‌ దర్శకుడు.. ఈసినిమాలో నటించటం వల్ల నవీన్‌ చంద్ర తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ధనుష్‌తో నటిస్తున మొదటి సినిమా అన్నారు.. తొలి షెడ్యూల్‌ పూర్తయిందన్నారు. ధనుష్‌ ఓ గొప్ప నటుడు అని, తన పనేదో తను చూసుకుంటాడని అన్నారు.. మే నెల నుంచి రెండో షెడ్యూల్‌ కు వెళ్లబోతున్నామని, ఈ షెడ్యూల్‌ కోసం చాలా హార్డ్‌ వర్క్‌ చేస్తున్నానని తెలిపారు. నాపాత్రలోనే కాదు బాడీలోనూ చాలా ట్రాన్స్‌ఫర్మేషన్స్‌ ఉంటాయన్నారు. దర్శకుడు దురై సెంథిల్‌ కుమార్‌ వంటి ప్రతిభావంతుడైన టెక్నీషియన్‌తోపాటు ఇంత హార్డ్‌ వర్కింగ్‌ టీంతో పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు..