‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన నరేశ్‌

Naresh
Naresh

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు నరేశ్‌ ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఈరోజు నరేశ్‌ ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విషయంలో కొంతకాలంగా నరేశ్‌కు, ‘మా’ మాజీ అధ్యక్షుడు, శివాజీ రాజాకు అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. కాగా ఆయన కూడా ఈరోజు ప్రమాణస్వీకారానికిహాజరుకావడం గమనార్హం. ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ.. ‘మా’ కమిటీ భవిష్యత్తులో అద్భుతాలు చేయాలని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని, ఎప్పటిలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. నాకంటే ముందు అధ్యక్షులుగా పనిచేసిన వారు చెప్పిందేంటంటే.. మేం ఎక్కడెక్కడి నుంచో కష్టపడి ఫండ్స్‌ తీసుకొచ్చిపెట్టాం. దాంట్లోంచి పైసా కూడా కదపకుండా చూసుకున్నాం. మీరు కష్టపడి బయటనుంచి ఫండ్లు కలెక్ట్‌ చేసి తీసుకురావాలిగ అని చెప్పారు. తూచా తప్పకుండా వారి మాటను నేను పాటించాను. అదే విధంగా ఇప్పుడు పనిచేయబోయే కమిటీ కూడా అంతే కష్టపడాలని ఆశిస్తున్నాను. నా నుంచి ఏ సాయం కావాలన్నా నేను చేయడానికి సిద్ధమేగ అన్నారు. ‘మా’ కోసం ఓ ప్రత్యేక గీతాన్ని కమిటీ రూపొందించినట్లు ఈ సందర్భంగా నరేశ్‌ వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/