బిగ్‌ బాస్‌ 3 హోస్ట్‌గా నాగార్జున!

Nagarjuna
Nagarjuna

హైదరాబాద్‌: బిగ్‌ బాస్‌ రియాలిటీ షో కార్యక్రమం తెలుగులోను మంచి హిట్‌ అయిన విషయం తెలిసిందే. అయితే తొలి సీజన్‌ని ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేయగా, రెండో సీజన్‌కి నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. ఇక మూడవ సీజన్‌ ఎప్పుకి ఎవరు హోస్ట్‌ అనే విషయంలపై కొన్నాళ్ళుగా హాట్‌ హాట్‌ చర్చలు జరుగుతున్నాయి. కాగా తొలి సీజ‌న్‌ని ఎన్టీఆర్ అన్నీ తానై న‌డిపించి మంచి స‌క్సెస్ చేయ‌డంతో మూడో సీజ‌న్‌కి కూడా ఎన్టీఆర్‌నే హోస్ట్‌గా తీసుకోవాల‌ని నిర్వాహ‌కులు భావించారట‌. కాని ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్‌తో క్ష‌ణం తీరిక లేని స‌మ‌యం గడుపుతున్నాడు. రాజ‌మౌళి సినిమా అంటే రిలీజ్ వ‌రకు కంప్లీట్‌గా ఆ ప్రాజెక్ట్‌కి లాక్ అవ్వాల్సిందే. మ‌రి ఈ నేప‌థ్యంలో బిగ్ బాస్‌3ని ఎన్టీఆర్ హోస్ట్ చేయ‌డం అసాధ్యం. బిగ్ బాస్ సీజ‌న్ 3 హోస్ట్ రేస్ నుండి ఎన్టీఆర్ తప్పుకోవ‌డంతో ఆయన స్థానంలో ఎవ‌రిని తీసుకోవాలా అని నిర్వాహ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. నానినే కొన‌సాగిద్దామంటే రెండో సీజ‌న్‌కి వ‌చ్చిన నెగెటివ్ ఇంపాక్ట్ మూడో సీజ‌న్‌పైన ప‌డుతుందేమోన‌ని మా యాజ‌మాన్యం భావిస్తుంద‌ట‌. ఇక మీలో కోటీశ్వ‌రుడు వంటి రియాలిటీ షోతో ఆక‌ట్టుకున్న నాగార్జుననే వారికి ఉన్న ఏకైక ఆప్ష‌న్‌గా క‌నిపిస్తుంది. మీలో ఎవరు కోటీశ్వరుడు హోస్ట్ అనుభవాన్ని బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలోను ఉప‌యోగించి షోని మంచి హిట్ చేస్తార‌ని నిర్వాహ‌కులు అనుకుంటున్నార‌ట‌. ఇప్ప‌టికే ఆయ‌న‌తో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డం మొద‌లు పెట్టార‌ని త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంద‌ని తెలుస్తుంది.


మరిన్ని తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/