సమంతతో మరిన్ని సినిమాలు చేస్తా: అక్కినేని నాగచైతన్య

Nagachaitanya Interview Pic
Nagachaitanya Interview Pic

స్లో అండ్‌ స్టడీగా సినిమాలు చేసుకుంటూవెళ్తున్నారు అక్కినేని నాగచైతన్య.. రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాలతోపాటు భిన్నమైన కాన్సెప్ట్‌లకు మొగ్గుచూపుతున్నారు.. తాజాగా ఆయన సమంతతో కలిసి మజిలీ సినిమా చేశారు.. నిన్నుకోరి వంటి ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీతో దర్శకుడిగా మంచి క్రేజ్‌ తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈసందర్భంగా నాగచైతన్యతో ఇంటర్వ్యూ విశేషాలు..

మజిలీ ఎలా మొదలైంది?
శివ చేసిన నిన్నుకోరి చూశాను.. చాలా బాగుందని అన్పించింది.. ముఖ్యంగా డైరెక్టర్‌ క్లైమాక్స్‌ను డీల్‌ చేసిన విధానం బాగా నచ్చింది.. ఫోన్‌ చేసి అభినందించి ఇలాంటిటైప్‌ స్టోరీ ఉంటే చెప్పు అన్నాను. రెండు నెలల తర్వాత మజిలీ స్టోరీతో నా దగ్గరకు వచ్చాడు.. 20 నిముషాలు కథ చెప్పాడు.. వెంటనే ఒప్పుకున్నాను.

హీరోయిన్‌గా సమంత ఆప్షన్స్‌ మీదేనా?
కాదు..ఇది దర్శకుడి ఛాన్స్‌..శ్రావణి పాత్రకు సమంత అయితే బాగుంటుందని శివ అన్నాడు. నాక్కూడా పెళ్లి తర్వాత సామ్‌ నేను కలిసి నటించటానికి మంచ ఇస్టోరీ దొరికిందన్పించింది.. తాను కూడ బాగా చేసింది.

సమంత మీపై డామినేట్‌ చేసిందా?
చేసింది (నవ్వు).. నిజంగా తను ఈసినిమాలో నటించటం వల్ల నాకు బాగా హెల్ప్‌ అయ్యింది.. మా ఇద్దరి పాత్రలు కూడ చాలా ఇంటెన్సివ్‌గా ఉంటాయి. తన ప్తార కంటే నా పాత్ర గురించి కూడ చాలా టెన్షన్‌ పడింది.. తనతో పోటీ పడి నటించాల్సి వచ్చింది..

ఇంతకీ కథేమిటి?
ఇది పక్కాగా మిడికల్‌ క్లాస్‌ ఫ్యామిలీ సెంటిమెంట్స్‌ నేపథ్యంలో సాగే కథ.. ముఖ్యంగా వారి జీవితం ఎలా ఉంటుంది? లవ్‌ , లైఫ్‌ అన్నింటిలో ఫెయిల్‌ అయినా ఓ కుర్రాడి కథ ఇది ..అతని లైఫ్‌లోకి శ్రావణి అనే అమ్మాయి ఎంట్రీ అయ్యాక జరిగే పరిణామాలు ఏమిటనల్న కథతో చాలా నాచురల్‌ కథతో ఉంటుంది.. ఇందులో ఎమోషన్స్‌ అందరికీ నచ్చుతాయి.

సెట్స్‌లోనూ, ఇంట్లో సమంత మీ మధ్యసినిమా గురించి చర్చలు జరిగేనా?
సెట్స్‌లో ఉంటే ఇద్దరం ఈసినిమా గురించి చర్చించుకుంటాం.. ఇంకా బెటర్‌గా వచ్చేలా ట్రై చేస్తాం.. ఐతే ఉదయం 9 తో సాయంత్రం 5వరకే.. మేము యాక్టర్స్‌.. ఆ తర్వాత మాకు పర్సనల్‌ లైఫ్‌ ఉంటుంది కదా.. ఆ సమయంలో సినిమాల గురించి నో డిస్కషన్స్‌.

సమంతతో వర్క్‌ చేయటం వాళ్ల కంఫర్ట్‌ ఉంటుంది భావిస్తున్నారా;?
తప్పకుండా.. చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.. ఇద్దరం కలిసి మూడు నాలుగు సినిమాలు చేశాం.. తన బాడీ లాంగ్వేజ్‌ ఏమిటి నాకు తెలిసింది.. తాను ఎలా రియాక్ట్‌ అవుతుందో తెలుసు కాబట్టి తనతో నటించటం చాలా కంఫర్ట్‌గా ఫీల్‌ అవుతా.. భవిష్యత్తులో ఆమెతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది.

సమంత నటించిన తమిళ సూపర్‌ డీలక్స్‌ చూశారా?
చూశా.. అందులో సమంతతోపాటు అందరూ బాగా చేశారు.. నిజంగా చాలా మంచి సినిమా.. నాకు ఇలాంటి భిన్నమైన సినిమాలు చేయాలనీ ఉంది.కానీ అలాంటి ఛాన్సులు రావటం లేదు.. అందరూ రొమాంటిక్‌ కథలనే తెస్తున్నారు..తప్పకుండా నాకు ప్రయోగాత్మక పాత్రలు చేయాలని ఉంది..

నాగార్జున సినిమా చూసి, మార్పులు ఏమైనా చేశారా?;
ఇంకా ఆయన సినిమా చూడలేదు.. ముందే చూపిద్దాం అనుకున్నాం.. కానీ రీ రికార్డింగ్‌ అప్పటికే పూర్తి కాలేదు.. లవ్‌స్టోరీస్‌ గ్రౌండ్‌ స్కోర్‌ లేకుండా చూస్తూ అంత ఇంట్రెస్టింగ్‌గా అన్పించదు ..
నిర్మాతలు గురించి?
హరీష్‌.. సాహుతో కలిసి చేయటం హ్యాపీ అన్పించింది.. స్క్రిప్టు స్టేజ్‌లో ఇలాంటి సినిమాను ఓకే చేసి జడ్జి చేయటం గొప్ప విషయం.. నాకు , సామ్‌కు ప్రెస్టిజియస్‌ ప్రాజెక్టు ఇది.. అయితే నాన్నగారు కూడ అడిగారు మన స్టూడియోలో చేయకుండా బయటివాళ్లతో ఎందుకని, నిజానికి ఈ బ్యానర్‌లో చేయటం వల్ల హోం ప్రొడక్షన్‌లో చేసినట్టు అన్పించింది.. అంత ఫ్రీడమ్‌ ఇచ్చారు.

తదుపరి చిత్రాలు?
వెంకీమామ మరో షెడ్యూల్‌ ఈనెల 8 నుంచి మొదలవుతుంది..దాంతోపాటు బంగార్రాజు సినిమా కూడ ఉంటుంది.. అలాగే మరో రెండు కథలు కూడ వింటున్నా..