జూన్‌ 23న నడిగర్‌ ఎన్నికలు

nadigar sangam polls
nadigar sangam polls

చెన్నై: దక్షిణ భారత నటీనటుల సంఘం(నడిగర్‌ సంఘం) ఎన్నికలు జూన్‌ 23న తేదీన జరగనున్న నేపథ్యంలో విశాల్‌కు పోటీగా నటుడు ఉద§్‌ు పోటీ చేయనున్నట్లు సమాచారం. నడిగర్‌ సంఘానికి మూడు సంవత్సరాలకోసారి ఎన్నికలు నిర్వహించి కొత్త ప్యానల్‌ను ఎంపిక చేసుకుంటారు. గత 2015 అక్టోబరు 18న తేదీన జరిగిన ఎన్నికల్లో నాజర్‌ నేతృత్వంలోని ప్యానల్‌ ఎంపికయ్యింది. అధ్యక్షుడిగా నాజర్‌, ప్రధాన కార్యదర్శిగా విశాల్‌, కోశాధికారిగా కార్తీ, ఉపాథ్యక్షులుగా కరుణాన్‌, పొన్‌వన్నన్‌లు విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్నికలు జరిపి కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. కాని నడిగర్‌ సంఘం భవన నిర్మాణం పనులు జరుగుతున్నందువల్ల ఆరు నెలలు ఎన్నికలు వాయిదా వేశారు. ఈ ఆరు నెలలు ముగియడంతో ఎన్నికలు నిర్వహించాల్సిన నిర్భందం ఏర్పడింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/