ఆకట్టుకుంటున్న లుక్‌

Nabha Natesh in Ismart Shankar
Nabha Natesh in Ismart Shankar

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఇస్మార్ట్‌శంకర్‌.. డబుల్‌ దిమాక్‌ అనేది ట్యాగ్‌లైన్‌..పూరి జగన్నాధ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్స్ట్‌ బ్యానర్‌పై పూరి జగన్నాధ్‌, చార్మి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో సాంగ్‌ చిత్రీకరణ జరుగుతోందన్నారు. ఈసాంగ్‌లో నిధి అగర్వాల్‌ , నభా నటేష్‌ ఇద్దరూ రామ్‌తో నటిస్తున్నారని తెలిపారు. రీసెంట్‌గా దిమాక్‌ ఖరాబ్‌ అంటూ తెలంగాణ యాసతో సాగే ఈ పాటకు సంబంధించిన నిధి అగర్వాల్‌ లుక్‌కు చాలా మంచి స్పందన వస్తోందన్నారు. మెలొడీ బ్రహ్మా మణిశర్మ సంగీతం అందించారు..