మా అమ్మ సురక్షితం

అమీర్‌ఖాన్‌ వెల్లడి

Aamir Khan
Aamir Khan

స్టార్‌హీరో అమీర్‌ఖాన్‌ ట్విట్టర్‌ వేదికగా ఓ ముఖ్య విషయానఇన పంచుకున్నారు. ఆయన మాతృమూర్తికి కరోనా టెస్ట్‌ చేయగా నెగిటివ్‌ వచ్చిందట..

దానికి సంతోషం వ్యక్తం చేసిన అమీర్‌ తమకై ప్రార్థనలు చేసిన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. అమీర్‌ వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్‌ అని రాగా.,ఆయన కుటుంబ సభ్యులు మొత్తం కరోనా టెస్ట్‌ చేయించుకున్నారు.

ఈటెస్టులో అమీర్‌ఖాన్‌ తల్లికి వైరస్‌ సోకలేదని తెలుసుకుని అమీర్‌ సంతోషం వ్యక్తంచేశారు. ప్రస్తుతం అమీర్‌ ‘లాల్‌సింగ్‌ చద్దా అనే సినిమాలో నటిస్తున్నారు.

1994లో వచ్చిన పారెస్ట్‌ గంప్‌ అనే హాలీవుడ్‌ మూవీకి రీమేక్‌గా వస్తున్న ఈచిత్రాన్ని అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈచిత్రంలో అమీర్‌ఖాన్‌ ఆర్మీ జవాను పాత్ర చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/national/