మిధున్‌ చక్రవర్తి తనయుడు హీరోగా

MIDHUN CHAKRAVARTHY SON's FILM
MIDHUN CHAKRAVARTHY SON’s FILM

బాలీవుడ్‌ నటుడు మిధున్‌ చక్రవర్తి తనయుడు మిమో చక్రవర్తి ఇపుడు తెలుగులో పరిచయం కాబోతున్నారు. భోషో సమర్పణలో శ్రీకళా చిత్ర బ్యానర్‌పై రమణారావు బవసరాజు నిర్మిస్తున్నఈచిత్రానికి మాధవ్‌ కోదాడ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈచిత్రంలోని ఓపాటను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు.. జర్నలిజం, పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే థ్రిల్లర్‌గా కాన్సెప్ట్‌తో ఈచిత్రం రూపొందనుంది.. మిమో చక్రవర్తి సరసన ప్రముఖ మోడల్‌ సశాచెత్రి నాయికగా నటిస్తోంది.. ఇప్పటికే దాదాపు 80శాతం చిత్రీకరణ పూర్తయింది.. ఈచిత్రంలోపబ్‌సాంగ్‌ను గురువారం హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో చిత్రీకరిస్తున్నారు.. నిర్మాత రమణారావు మాట్లాడుతూ, థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న చిత్రమన్నారు దర్శకుడు మల్టీమీడియాలో గోల్డ్‌మెడల్‌ సాధించిన వ్యక్తి అని తెలిపారు. తన ఆలోచనలు వినూత్నంగా ఉన్నాయన్నారు. కథ చాలా బాగా వచ్చిందన్నారు. ఫిబ్రవరిలో ఫస్ట్‌లుక్‌, చిత్రం టైటిల్‌ను ప్రకటిస్తామన్నారు.