సూపర్ మెలోడీ సాంగ్

A Still From Sarileru Neekevvaru

సూపర్ స్టార్ మహేష్ బాబు అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’ తో సంక్రాంతికి రానున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ మైండ్ బ్లాక్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్ రాగా ఆడియన్స్, ఫాన్స్ ఎదురు చూస్తున్న సెకండ్ సాంగ్, డిసెంబర్ 9న (సోమవారం) సాయంత్రం 5:04 కి విడుదల కానుంది. ‘సూర్యుడివో చంద్రుడివో’ అనే పల్లవి తో సాగే ఈ పాట వినసొంపైన ఫామిలీ మెలోడీ సాంగ్ గా ఉండనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంత గానో ఆకట్టుకునే ఒక సోల్ ఫుల్ మెలోడీ గా ఈ ‘సూర్యుడివో చంద్రుడివో’ సాంగ్ ని కంపోజ్ చేశారు. ఎన్నో మెలోడీ సాంగ్స్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ చేసిన మరో సూపర్ మెలోడీ సాంగ్ ఇది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకి సంబంధించి విడుదలైన పోస్టర్ కూడా ఇదొక ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉండే క్లాసీ సాంగ్ గా ఉండనుందని తెలియజేస్తోంది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/