టైటిల్‌ పాతదే.కానీ కంటెంట్‌ కొత్తది

Maruti1
Maruti

టైటిల్‌ పాతదే.కానీ కంటెంట్‌ కొత్తది: మారుతీ

మహానుభావుడు చిత్రంతో సూపర్‌హిట్‌ అందుకున్న ప్రముఖ దర్శకుడు మారుతీ తెరకెక్కించిన నూతన చిత్రం శైలజారెడ్డి అల్లుడు.. వినాయక చవితి కానుకగా ఈనెల 13న విడుదల కానుంది.. ఈసందర్భంగా దర్శకుడు మారుతీ మీడియాతో మాట్లాడారు..

సినిమా ఎలా ఉండనుంది?
నేను తీసిన అన్ని సినిమాల్లో కంటే ఈసినిమా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది.. నాకు చాలా సంతృప్తి నిచ్చింది.. నిన్న సినిమా చూశాను.. చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా హిట్‌ అవుతుంది.

నాగచైతన్య బాడీ లాంగ్వేజ్‌ను మార్చేసినట్టున్నారు?
ఒక నటుడికి అనుభవం వస్తున్న కొద్దీ తనకు తనను సినిమాకు కావాల్సినట్టుగా మార్చుకోగలడు.. ఈసినిమాకు చైతు అదే చేశాడు.. చాలా యాక్టివ్‌గా ఈసినిమాలో నటించాడు.. కొన్ని కొన్ని సీన్లలో వాళ్ల నాన్న నాగార్జునగారిని చూసినట్టుగా అన్పించింది.. తన పాత్రకు ఎంత కావాలో అంత వరకు యాక్టివ్‌గా చేశాడు.. మామూలుగా నేనే రాసుకునేదే కొంచెం వేరే లెవల్‌లో ఉంటుంది.. చైతు దాన్ని అందుకున్నాడు.. అలాగని ఎక్కడా ఓవర్‌ యాక్టింగ్‌ ఉండదు.

ఈచిత్రం దేని గురించి ఉండనుంది?
టైటిల్‌ చూడగానే ఇదేదో అల్ల, అల్లుడు మధ్య ఛాలెంజ్‌ లాగా అలా ఉండదు అవ్వన్నీ అప్పట్లోనే చూశాం.. ఇద్దరు హీరోయిన్లు తల్లి కూతుళ్ల మధ్య హీరో ఎలా నలిగిపోయి చివరకు తను అనుకున్నది ఎలా సాధించాడు. అన్నదే కథ..

నాగచైతన్యను తీసుకోవటానికి కారణం?
ఈసినిమాలో హీరో పాత్ర చాలా కూల్‌గా పాజిటివ్‌ మైండ్‌సెట్‌తో చాలా ఒప్పికతో ఉంటుంది.. ఈ లక్షణాలకు నాగచైతన్య కరెక్టుగా సరిపోతాడని అన్పించింది.. ఆయన్ని చూస్తే ఎవరికైనా అదే అన్పిస్తుంది.. సో అలా ఈ పాత్రకు చైతును తీసుకున్నాను.. ఆ పాత్రకు చైతు 100శాతం సూట్‌ అయ్యాడు.

మీ గత చిత్రాల్లో మాదిరిగా ఈసినిమాలో కూడ ఏమైనా లోపాలు పెట్టారా?
లేదు. ఈసినిమాలో ఇగో అనే కాన్సెప్ట్‌ ఉంటుంది. .అలాని అది లోపం కాదు.. అది ఒక గుణం.. మనందరికీ ఉండేదే.. కాకపోతే సినిమాతో కొంచెం డోస్‌ పెంచా.. ఈ ఇగో ఎక్కువైతే ఏమవుతుంది దానితో వచ్చే సన్నివేశాలు చాలా కామెడీగా ఉంటాయి..

చిత్ర నిర్మాతల గురించి?
నేను ఇప్పటి వరకు తీసిన సినిమాలకు నా ఫ్రెండ్స్‌ నిర్మాతలుగా ఉన్నారు. ఈసినిమాకు వేరే నిర్మాతలు. కానీ నాగవంశీ, రాధాకృష్ణగారు నేను ఏది అడిగితే అది ఇచ్చారు.. వాళ్లు ముందే చెప్పారు. బడ్జెట్‌ పెంచండి అని. కానీ నా పరిధిలో మంచి క్వాలిటీతో ఈసినిమా తీశాను.

మీ తదుపరి చిత్రం గురించి?
యూవీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో ఒక చిత్రం చేస్తున్నా తర్వాత మహేష్‌బాబు గారి సిస్టర మంజులగారు నిర్మాతగా ఇంకో సినిమా కమిట్‌ అయ్యాను.

దేవరకొండతో సినిమా?
దేవరకొండతో తీయాలని ఉంది.. నేను డైరెక్టు చేయాలనుకున్న హీరోలతో విజ§్‌ు కూడ ఉన్నాడు.. విజ§్‌ు కూడ అడిగాడు సినిమా చేద్దాం సార్‌ అని మంచి కంటెంట్‌ దొరికితే త్వరలోనే తీస్తా.