ఆయన పాత్రను చూపించే అవకాశం రాలేదు

Mahi V.Raghav
Mahi V.Raghav

ఆయన పాత్రను చూపించే అవకాశం రాలేదు.: మహి వి.రాఘవ్‌

దివంగత సిఎం వైఎస్‌ జీవిత చరిత్రలో ఆయన చేపట్టిన పాదయాత్రలోని కీలక ఘట్టాలను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రం యాత్ర.. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి వెఎస్‌పాత్రలో నటించారు. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మహి వి.రాఘవ్‌ దర్శకత్వంలో విజ§్‌ు చిల్లా, శశిదేవిరెడ్డి నిర్మించిన ఈచిత్రం ఫిబ్రవరి8న విడుదల కాబోతోంది..ఈసంద్భంగా దర్శకుడు మహి వి.రాఘవ్‌తో ఇంటర్వ్యూ విశేషాలు

ఈ యాత్ర ఎలా స్టార్ట్‌ అయ్యింది?
నేను వైఎస్సార్‌ గురించి కొన్ని ఆర్టికల్స్‌ చదివాను..అలాగే కొందర్ని కలిసి ఆయన గురించి అడిగినపుడు ఆయన గురించి చాలా మంచిగా చెప్పారు.. ఇండియాలోని రాజకీయనాయకుల గురించి అంత మంచిగా చెప్పటం చాలా అరుదు.. సో అపుడే ఆయన సినిమా తీయాలని ఆలోచన వచ్చింది.. పాదయాత్ర అనే అంశాన్ని తీసుకుని ఈచిత్రానిన తెరకెక్కించటం జరిగింది

వైఎస్‌కుటుంబ సభ్యులను కలిసారా?
లేదండీ..కథ రాసుకన్న తర్వాత ఈచిత్రం పోస్టర్‌ను చూపించటానికి పాదయాత్రలో ఉన్నపుడు జగన్‌ గారిని కలిశాను..వైఎస్‌ రాజకీయ జీవితంలోని ఒక పార్ట్‌ను తీసుకుని ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఈచిత్రానిన తెరకెక్కిస్తున్నానని చెప్పాను..దానికి జగన్‌గారు కూడ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.

మమ్ముట్టిని తీసుకోవటానికి కారణం?
ఈసినిమాకు ఆయన అయితే కరెక్ట్‌గా ఉంటుందని అనుకున్నా.. మమ్ముట్టికి ఉన్న చరిష్మా అలాగే ఆయన తెలుగులో కూడ సినిమాలు చేశారు.ఆయన ఫేస్‌లో హంబుల్‌ నెస్‌ కన్పిస్తుంటుంది.. దళపతి సినిమా చూసి వైఎస్‌పాత్రకు ఆయన అయితే బాగుంటుందని ఆనుకుని ఆయన్ని సంప్రదించాను..

చంద్రబాబునాయుడు పాత్ర ఈసినిమాలో ఉంటుందా?
లేదండీ.. చంద్రబాబునాయుడుగారి పాత్ర సినిమాలో కనపడదు.. ఒకరిని గొప్పగా చూపించటానికి మరొకరిని తక్కువ చేసి చూపించాల్సినఅవసరం లేదు.. నా కథ ప్రకారం ఆయన పాత్రను చూపించే అవకాశం రాలేదు.