ఫ్యాన్స్‌ ప్రేమకు థ్యాంక్స్‌

-ట్విట్టర్‌లో మహేష్‌బాబు స్పందన

Mahesh Babu

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ట్విట్టర్‌ ఫాలోవర్స్‌ సంఖ్య 10 మిలియన్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. సౌత్‌ ఇండియాలోనే ఆ ఘనత సాధించిన మొదటి హీరోగా మహేష్‌ రికార్డుల కెక్కారు.

సౌత్‌లో మరే హీరోకు కూడ 10 మిలియన్‌ ట్విట్టర్‌ ఫాలోవర్స్‌ లేకపోవటం విశేషం..

కాగా అభిమానులు తన పట్ల చూపిన ఆ అభిమానానికి మహేష్‌ సోషల్‌మీడియా వేదికగా స్పందించారు.

తనను ఇంతగా అభిమానిస్తున్న ఫ్యాన్స్‌ ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా ఆయన తన ఆనందం వ్యక్తంచేశారు.. ఇక మహేష తన తదుపరి మూవీ దర్శకుడు పరశురామ్‌తో చేస్తున్నారు.

సర్కారు వారి పాట టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది..ఈచిత్రంలో కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.. థమన్‌ సంగీతం అందిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/