సుదర్శన్ థియేటర్ కు!

Mahesh-Babu-Will-Be-Visiting-Sudarshan
Mahesh-Babu-Will-Be-Visiting-Sudarshan

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘మహర్షి’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ డీసెంట్ గానే ఉన్నాయి. అయితే సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో కలెక్షన్స్ లో ఊపు తెచ్చేందుకు ‘మహర్షి’ టీమ్ ప్రమోషన్స్ లో జోరు చూపిస్తోంది. మహేష్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ బజ్ పెంచే ప్రయత్నాలలో ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా రేపు మహేష్ బాబు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ కు వెళ్తున్నాడని సమాచారం.  రేపు సాయంత్రం అంటే.. బుధవారం సాయంత్రం 6 గంటలు మహేష్ సుదర్శన్ థియేటర్ ను సందర్శిస్తారట. ఈ థియేటర్లో ఇప్పటివరకూ మహేష్ బాబు కెరీర్ లో సూపర్ హిట్స్ గా నిలిచిన చాలా సినిమాలు ప్రదర్శితమయ్యాయి.