నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం..

Mahesh Babu in Maharshi
Mahesh Babu in Maharshi

సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న సూపర్‌స్టార్‌ మహేష్‌ మహర్షి సెకండ్‌ సింగిల్‌…
సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌. వైజయంతి, పివిపి సినిమా పతాకాలపై రూపొందుతున్న భారీ చిత్రం మహర్షి… సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావటం విశేషం… మహేష్‌ సరసన పూజాహెగ్డే, హీరోయిన్‌గా నటిస్తోంది.. అల్లరి నరేష్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు.. ఈచిత్రాన్ని మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.. ఈచిత్రానికి సంబంధించిన టీజర్‌ ఉగాది కానుకగా విడుదలైన కొన్ని గంటల్లోనే 16 మిలియన్‌ రియల్‌ టైమ్‌ వ్యూస్‌ సాధించి ఆల్‌టైమ్‌ రికార్డును క్రియేట్‌ చేసింది.. ఇంతకుముందు విడుదలైన ఈ సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ చోటి చోటి బాతే..మీటి మీటి యాదే. .యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యింది.. శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.. ఇదిలా ఉండగా, ఈనెల 12న మహర్షి చిత్రానికి సంబంధించిన సెకండ్‌ సింగిల్‌ను విడుదల చేశారు.. నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం.. నువ్వే నీపంతం.. నువ్వేలే అనంతం.. ప్రతి నిసీ మసై..నీలో కసే దిశై.. అడుగేసే§్‌ు మిసైలుగా..అంటూ శ్రీమణి రాసిన పాటను దేవిశ్రీప్రసాద్‌ స్వరపర్చగా, యాజిక్‌ నిజార్‌ ఎంతో ఉద్వేగంగా గానం చేశారు.. శ్రీమణి సాహిత్యం,దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందర్నీ ఆకట్టుకునేలా ఉండటం వల్ల ఈపాట మరో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందని అంటున్నారు..