నమ్రతా సిస్టర్స్ తో సంబరాలు

Mahesh-Babu-Enjoying-with-Namrata-and-Her-Sister-Shilpa-Sirodhkar
Mahesh-Babu-Enjoying-with-Namrata-and-Her-Sister-Shilpa-Sirodhkar


మహర్షి దూసుకుపోతోంది. ఇంకా మొదటి వారం పూర్తి కాకుండానే 100 కోట్ల గ్రాస్ ని దాటేసినట్టు నిర్మాతలు అధికారికంగా పోస్టర్ రూపంలో ప్రకటించేశారు.ఇందులో షేర్ ఎంత అన్నది ఇవాళ తేలుతుంది కానీ ఇది చూశాక మహేష్ ఫాన్స్ ఆనందం మాములుగా లేదు. ప్రిన్స్ కూడా తన ఉద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మహేష్ తో భార్య నమ్రతా శిరోద్కర్ తో పాటు ఆవిడ సిస్టర్ శిల్పా శిరోద్కర్ ముగ్గురు కలిసి ఆనందం పట్టలేక ఒకరికొకరు కిందపడి పెనవేసుకున్న దృశ్యం ఇప్పుడు రచ్చ చేస్తోంది. ఒకప్పటి హీరోయిన్ అయిన శిల్పా శిరోద్కర్ హిందీ సినిమాలు రెగ్యులర్ గా చూసే అలవాటు ఉన్న వాళ్లకు సుపరిచితురాలే. కానీ ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చాక కనిపించడం మానేశారు. మళ్ళి ఇన్నాళ్లకు ఈ ఫోటో రూపంలో చూసే ఛాన్స్ దక్కింది. ముందు నుంచి మహర్షి ప్రమోషన్ లో యాక్టివ్ గా ఉన్న నమ్రతా దానికి తగ్గ ఫలితాన్ని అందుకున్న ఆనందాన్ని తన కళ్ళలో చూపిస్తోంది