నాకు నచ్చింది చేస్తా

-హీరోయిన్‌ మధుషాలిని వెల్లడి

Madhu Shalini

స్నేహా ఉల్లాల్‌, టోనీ లూక్‌, మధుషాలిని, ఆలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘ఎక్స్‌పైరీ డేట్‌’ . శంకర్‌ కె.మార్తాండ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. నిర్మించింది..

తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన తొలి బైలింగ్వల్‌ వెబ్‌సిరీస్‌ ఇది. జీ 5లో అక్టోబర్‌ 2న హిందీ వెర్షన్‌ 9న తెలుగు వెర్షన్‌ విడుదలైంది..

దీనికి మంచిస్పందన లభిస్తున్న నేపథ్యంలో మధు షాలిని మీడియాతో మాట్లాడింది. హిందీతో సౌత్‌సిరీస్‌ అని అనుకున్నారు..

కానీ సిరీస్‌ చూశాక చాలా మంది మెసేజ్‌లు చేశారు. బావుందని మెచ్చుకున్నారన్నారు. కొన్ని అవకాశాలు వచ్చాయని, త్వరలో తను ఆడిషన్‌ కూడ ఇవ్వనున్నారని అన్నారు.

నిజ జీవితంలో నేను ఎలా ఉంటానో అందుకు భిన్నమైన పాత్ర ఇది అన్నారు.

చాలా వెబ్‌సిరీస్‌లుచూశానని, ఫీమేల్‌ క్యారెక్టర్లు మాత్రమే కాకుండా మేల్‌ క్యారెక్టర్లు రిఫరెన్స్‌గా తీసుకున్నానని తెలిపారు.. కథ కొత్తగా ఉంటుందన్నారు..

దర్శకుడు చాలా బాగాచేశారని, రిలేషన్‌షిప్స్‌ను కొత్తగా చూపిస్తున్నారని అన్పించిందన్నారు.

సీక్వెల్‌కు కూడ ఛాన్స్‌ ఉందని అన్నారు. ప్రస్తుతం తమిళ దర్శకురాలు బాలాగారు నిర్మాణంలో ఒక సినిమా చిత్రీకరణ పూర్తిచేశానని, మరో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం చేస్తున్నానని, తెలుగులో కూడ గూఢచారి 2 ఉందన్నారు.

ఏడాదికి ఒక్కసినిమా చేసినా చాలు.. నాకు నచ్చింది చేస్తా.. మంచి పాత్రలు లభించాలి.. కథ బాగుంటే నన్ను ఒప్పించాల్సిన అవసరం లేదు ..బాబూ..నేనే నటిస్తా. అని వెళతా ..ఇంట్రెస్టింగ్‌గా ఉండాలన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/