కెఎస్‌ 100

KS Teaser
A Still From KS 100

సమీర్‌ఖాన్‌, శైలజల కెఎస్‌ 100

మోడలింగ్‌ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సమీర్‌ఖాన్‌, శైలజ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం కెఎస్‌ 100.. చంద్రశేఖరా మూవీస్‌ పతాకంపై వెంకట్‌రెడ్డి నిర్మిస్తున్న ఈసినిమాకు షేర్‌ దర్శకత్వం వహిస్తన్నారు.. రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈసినిమా ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ విడుదల కాగా, మంచి స్పందన వచ్చింది.. పోస్టప్రొడక్షన్‌ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈసినిమా ప్రస్తుతం సెన్సార్‌కార్యక్రమాల్లో ఉంది.. ఈ నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతుండగా, చిత్ర దర్శకుడు దర్శకుడు మాట్లాడారు.. ఈచిత్రం అవుట్‌పుట్‌ చాలా బాగా వచ్చిందన్నారు.. ప్రస్తుతం సెన్సార్‌కార్యక్రమాలు జరుపుకుంటోందని, ఈనెలలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈసినిమా ఇంత బాగా రావటానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు అనానరు.. లక్షిత, ఆషి, పూర్విసునీత, శ్రద్ధా, నందిని , కల్పన అజీమ్‌ , సుమన్‌ తదితరులు నటించారు..