‘కృష్ణ అండ్ హిజ్ లీల’ టీజర్

A Still From Krishna and his Leela

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానా దగ్గుబాటి సమర్పిస్తోన్న చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. ‘గుంటూర్ టాకీస్’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న ఈ మూవీని ‘క్షణం’తో డైరెక్టర్ గా పరిచయమై సంచలనం సృష్టించిన రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్నారు.

వేలంటైన్స్ డే సందర్భంగా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ టీజర్ ను హీరో విక్టరీ వెంకటేష్ శుక్రవారం ఆవిష్కరించారు. ఒక సమకాలీన అంశంతో ఈ టీజర్ ఆసక్తి కలిగిస్తోంది. ‘క్షణం’తో పోలిస్తే తన రెండో సినిమాను ఒక డిఫరెంట్ స్టోరీతో రవికాంత్ రూపొందిస్తున్నారు. సరికొత్త కథనంతో మ్యాజిక్ చెయ్యడం ఆయన బలం. సమాజంలో వైరల్ అయిన రూమర్స్ ఆధారంగా ఈ కథను రవికాంత్ రాయడం గమనార్హం.

రాంగ్ టైమ్ రిలేషన్ షిప్స్ తో సమస్యల్లో చిక్కుకొనే యువకుడిగా ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ కనిపించనున్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడి తరహాలో పలువురు భామలతో అతను సరసాల్లో మునిగితేలుతుంటాడు. హీరోయిన్లుగా శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, శాలిని వడ్నికత్తి నటిస్తున్నారు.

సబ్జెక్టుకు తగ్గ మ్యూజిక్‌ను శ్రీచరణ్ పాకాల అందిస్తున్నారు. హీరో క్యారెక్టరైజేషన్ తెలిపేవిధంగా ‘పులిహోర కలిపెనులే’ అంటూ వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ నవ్విస్తుంది. ఈ ‘పులిహోర’ ట్రాక్ ను హేమచంద్ర రచించి పాడారు. మే 1న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామనీ, త్వరలో ట్రైలర్ రిలీజ్ చేస్తామనీ చిత్ర బృందం తెలిపింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/