అక్టోబర్‌ నుంచి హిందీ ‘ఖైదీ’

బాలీవుడ్‌ స్టార్‌ అజయ్ దేవగన్‌ సన్నాహాలు

Ajay Devgan
Ajay Devgan

తమిళ హిట్‌ మూవీ ఖైదీ తెలుగులో ఎంతటి ఘనవిజయం అందుకుందో తెలిసిందే. ఈ మధ్య దక్షిణాది పరిశ్రమల సినిమాలపై బాలీవుడ్‌ నిర్మాతలు ఆసక్తిచూపుతున్నారు.

అందుకే ఈ రీమేక్‌ చ్తిరంలో స్టార్‌హీరోనే ఉంచాలని భావించి అజయ్ దేవగన్‌ను సంప్రదించగా ఆయన ఈచిత్రం చూసి వెంటనే డేట్స్‌ ఇచ్చేసిన సంగతి తెలిసిందే.

కరోనా కారణంగా ఈసినిమా షూటింగ్‌ వాయిదా పడింది.

తాజా బాలీవుడ్‌ సమాచారం ప్రకారం.. అక్టోబర్‌ మొదటివారం నుంచి ఈ రీమేక్‌ మూవీ షూటింగ్‌ స్టార్ట్‌ చేయాలని యూనిట్‌ భావిస్తోంది..

2021 ఫిబ్రవరి 12న ఈరీమేక్‌ విడుదల కానుందని అజయ్ అనౌన్స్‌ చేశారు..

హీరోపై, మాస్‌ ఎలిమెంట్స్‌, ఫాదర్‌ డాటర్‌ ఎమోషన్‌ పై నడిచే ఈసినిమా కథ హిందీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిసుతందని భావించిన రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈచిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/