సైఫీనా ఈజ్‌ బ్యాక్‌ అంటూ కామెంట్లు

Kareena kapoor, Saif Alikhan Romantic Still
Kareena kapoor, Saif Alikhan Romantic Still

బాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షించేస్టార్‌ కపుల్స్‌లో కరీనాకపూర్‌, సైఫ్‌ ఆలీ ఖాన్‌ జంట ఒకటి. చాలా రోజుల తర్వాత సైఫీనా జంట ఒక రొమాంటిక్‌ ఫోజుతో అందరినీ క్లీన్‌ బౌల్డ్‌ చేసింది.. రీసెంట్‌గా ఒక యాడ్‌ కోసం వీరిద్దరూ కలిసి ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఆ ఫొటోను ఓ ప్రముఖ మ్యాగజైన్‌ తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా షేర్‌ చేయటంతో వెంటనే వైరల్‌ అయి కూర్చుంది.. స్విమ్‌సూట్‌లో కరీనా బీచ్‌బెడ్‌పై రిలాక్స్‌ అవుతూ ఉంది.. అదే బెడ్‌పై సైఫ్‌ కూర్చుని కరీనాను ప్రేమగా చూస్తున్నారు.. ఈ ఇద్దరి రొమాంటిక్‌ ఫోజు నెటిజన్‌లకు తెగ నచ్చేసింది.. ఫ్యాన్స్‌ అయితే సైఫీనా ఈజ్‌ బ్యాక్‌ అంటూ కామెంట్లు పెడుతూ .. ఈ ఫొటోకు లైక్స్‌కొడుతున్నారు.. అప్పట్లో ఈ ఇద్దరూ లవ్‌లో ఉన్నపుడు సైఫీనా అని పిలిచేవారు.. ఇన్నాళ్లకు మళ్లీ ఆ పదం విన్పించింది..