24 కోట్లు డిమాండ్

Kangana Ranaut Demands Rs.24 Crores
Kangana Ranaut

తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ అనే టైటిల్ తో బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. అయితే ఈ బయోపిక్ లో నటించడానికి కంగనా రనౌత్ 24 కోట్లు డిమాండ్ చేసిందట. ఆమె డిమాండ్ చేసిన ఎమౌంట్ ను ఇచ్చేందుకు నిర్మాతలు అంగీకరించారని సమాచారం.

ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. ఎలాగూ కంగనాకు బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది దాంతో సినిమాకి పెట్టిన డబ్బు ఈజీగా వెనక్కి వచ్చేస్తోందని నిర్మాతలు ఆలోచిస్తోన్నట్లు తెలుస్తోంది.

ఇక జయలలిత లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే కంగనా రనౌత్ లాంటి బలమైన నటి అయితేనే ఆ పాత్రకు న్యాయం జరుగుతుంది. మరి జయలలిత పాత్రలో కంగనా రనౌత్ ఎలా నటిస్తుందో చూడాలి.