ఒళ్లంతా రక్తపు మరకలతో

KANGANA
KANGANA

రియల్‌ లైఫ్‌ లోనే క్వీన్‌గా వెలిగిపోయిన కంగనా ఝాన్సీరాణిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. యాప్ట్‌ పర్సనాలిటీనే ఈ సినిమాకు ఎంపిక చేసుకున్నారన్న ఆసక్తి నెలకొంది.. మణికర్ణిక టైటిల్‌తో క్రిష్‌ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. మెజారిటీ పార్ట్‌ చిత్రీకరణ పూర్తయింది.. అయితే బ్యాలెన్స్‌ షూటింగ్‌ను క్రిష్‌ బదులుగా కంగనా స్వయంగా తెరకెక్కించటం ఇటీవల చర్చకొచ్చింది.. క్రిష్‌తో కంగనా వివాదం గురించి అభిప్రాయ బేధాల గురించి ఆసక్తిర డిబేట్‌ కూడ నడిచింది.. ఇక ఆ విషయం పక్కనపెడితే.. కంగనా కదనరంగంలో కథం తొక్కి శత్రువుల రక్తంతో స్నానమాడిన ఫొటో ఒకటి అంతర్జాలంలో లీకై వేడి పెంచేసింది.. ఒళ్లంతా రక్తపు మరకలతో ముఖం అంతా రక్తంతో తడిసిపోయింది.. ఇలాంటి భీకరమైన యుద్ధసన్నివేశాన్ని తెరకెక్కించారని తెలుస్తోంది.. ఈచిత్రం సంక్రాంతి బరిలో రానుంది..