షూటింగ్‌ లొకేషన్‌లో అల్లరి

Kajol,  Bellamkonda
Kajol, Bellamkonda

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా తేజ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..ఇక్కడ చిత్రం చూస్తే.. శ్రీనివాస్‌ , కాజల్‌ కలిసి షూటింగ్‌ లొకేషన్‌లో చేసే అల్లరి కన్పిస్తోంది.. తాజాగా బెల్లంకొండ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కాజల్‌ను భుజాలపై ఎక్కించుకున్నాడు.. ఇక రెండు చేతులు పైకెత్తి నన్నుచూడండి.. నా స్టైల్‌ చూడండి అన్నట్టుగా ఫోజిచ్చాడు.. ఇక టాలీవుడ్‌ చందమామ కాజల్‌ స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ టైపులో ఒక చేయి పైకెత్తి మరో చేతిని నడుముపై ఉంచి స్లైల్‌గా ఫోజిచ్చింది.. ఈ ఫొటోపై నెటిజన్లు కామెంట్లు చేస్తూనేఉన్నారు..