వైట్ హార్స్ ని తలపిస్తోంది

Kajal Latest Pic
Kajal Latest Pic

కాజల్ మరోవైపు సామాజిక మాధ్యమాల్లోనూ వేడి పెంచుతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అద్భుతమైన ఫోటో షూట్లను ఇన్ స్టాగ్రమ్ లో రివీల్ చేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో విరుచుకుపడుతోంది. తాజాగా రివీల్ చేసిన వైట్ హార్స్ లుక్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. నిన్నటిరోజున ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందినా అది కాస్తా ఆలస్యంగా అందిందని కాజల్ పీఎంవోకి ఫిర్యాదు చేసింది. ఆ మేరకు ఇన్ స్టాలో పీఎంవో ఇన్విటేషన్ పోస్ట్ చేసి దాంతో పాటే తన బాధను వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఓ సర్ ప్రైజింగ్ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసి షాకిచ్చింది. టాప్ టు బాటమ్ వైట్ అండ్ వైట్ లో చందమామ జిగేల్మనిపించింది. ఈ లుక్ లో వైట్ హార్స్ ని తలపిస్తోంది అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు