జాన్వీ ఫిట్నెస్..

Jhanvi-Kapoor-in Gym

కథానాయికలంతా జీరో సైజ్ ని మించి ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ యువకథానాయికలు ఈ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. బాడీని పర్ఫెక్ట్ ఫిట్ గా తీర్చిదిద్దేందుకు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. నిరంతరం జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ అలుపన్నదే లేకుండా శరీరంలో ప్రతి అంగాన్ని తమకు నచ్చినట్టు మలుచుకుంటున్నారు.
జాన్వీ మరీ ఫిట్నెస్ ఫ్రీక్ అనే చెప్పాలి. పబ్బు.. క్లబ్బులో పార్టీలు.. విదేశీ షికార్.. లేదా షూటింగులు అంటూ రకరకాల బిజీల్లో ఉన్నా టైమ్ అయ్యేసరికి ఈ అమ్మడికి గంట కొట్టేస్తుంది. జిమ్ టైమ్ ని మాత్రం అస్సలు మిస్ చేయదు. అయితే ఆ డెడికేషన్ తోనే ఇదిగో ఇలాంటి అందమైన ఫిజిక్ ని తీర్చిదిద్దింది. శరీరంలో అంగాంగాన్ని వర్ణించేందుకు కొన్ని పేజీల పాఠం రాయాలేమో! అన్నంత వయ్యారంగా తన దేహాకృతిని మార్చేసింది ధడక్ లో నటిగా మెప్పించింది. ప్రస్తుతం ఒకేసారి మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. గుంజన్ సక్సేనా బయోపిక్ ది కార్గిల్ గర్ల్ త్వరలో రిలీజ్ కి రానుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/