వెబ్‌ సిరీస్‌ల్లోకి..

అచ్చతెలుగమ్మాయి ఇషారెబ్బా భిన్నమైన క్యారెక్టర్‌లో..

Eesha Rebba
Eesha Rebba

అచ్చ తెలుగు అమ్మాయి ఇషారెబ్బా…ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అంతకుముందు ఆ తర్వాత అనే సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది..

ఈక్రమంలోనే బందిపోటు, అమీతుమీ, మాయా మాల్‌ , దర్శకుడు, సుబ్రహ్మణ్యం, బ్రాండ్‌బాబు , ఆ, అరవింద సమేత వీరరాఘవ వంటిసినిమాల్లో నటించి మెప్పించింది..

ఇటీవల ‘రాగల 24 గంటల్లో అనే క్రైమ్‌థ్రిల్లర్‌ మూవీలో నటించింది.. కాగా ఈషా ప్రస్తుతం పాపులర్‌ వెబ్‌సిరీస్‌ లస్ట్‌స్టోరీస్‌ తెలుగు రీమేక్‌లో నటిస్తోంది..

ఇప్పటిదాకా రెబ్బా నటించిన పాత్రలకంటే ఈ వెబ్‌సిరీస్‌లో ఆమె పోషించిన క్యారెక్టర్‌ భిన్నమైందని చెప్పవచ్చు.. దీంతోపాటు తమిళ సినిమాలో నటిసోతంది.

ఈ మధ్య సోషల్‌మీడియాలో ఫొటోషూట్లుతో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ తెలుగులో మరో న్యూప్రాజెక్టుకు సైన్‌ చేసిందని తెలిసింది..

డైరెక్టర్‌ సంపత్‌ నంది తెరకెక్కించబోతున్న ఓ వెబ్‌సిరీస్‌లో ఈషారెబ్బా వేశ్యపాత్రలో నటంచబోతోందని తెలిసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/