పాజిటివ్ కంటే నెగెటివ్ కామెంట్స్ ఎక్కువ

Iliyana New Look
Iliyana New Look

రీసెంట్ గా ఇలియానా లుక్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి.  సాధారణంగా ఈ గోవా బ్యూటీ పాలకోవాలాగా ఉంటుంది.  నయాగరా జలపాతం లాంటి నడుము ఒంపులతో ఖజురహో శిల్పానికి మోడరన్ వెర్షన్ లా అనిపిస్తుంది.  కానీ కొంత కాలం క్రితం కాస్త వెయిట్ పెరిగింది.. దీంతో అందరూ బొద్దుగా ఉందని మాట్లాడడం ప్రారంభించారు. కొందరయితే ఇంగ్లీష్ లో అదేదో బాడీ షేమింగ్ అంటారు చూడండి.. దానికి కూడా పాల్పడ్డారు.  అయితే ఇల్లీ బేబీ కసరత్తులు చేసి మళ్ళీ తగ్గినట్టు అనిపించింది.   ప్రొఫెషన్ ఫోటోగ్రాఫర్ కాబట్టి మంచి ఫోటోలు తీస్తున్నాడు. ఆ ఫోటోలను ఇల్లీ బేబీ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి మెప్పిస్తోంది. 
ఇల్లీ బయట కనిపిస్తే ఎవరో ఒక ఫోటోగ్రాఫర్ క్లిక్కుమనిపించాడు.  ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  అయితే ఈ ఫోటోకు పాజిటివ్ కామెంట్స్ కంటే నెగెటివ్ కామెంట్స్ ఎక్కువ వచ్చాయి.  అందరి కామన్ కంప్లయింట్ ఏంటంటే.. ఇల్లీ ఫేసులో వయసు కనిపిస్తోందట. ముప్పైలు దాటడం.. కెరీర్ సజావుగా సాగకపోవడం.. ఇలాంటి కారణాలు అన్నీ ఇల్లీ అందం మీద ప్రభావం చూపించాయేమో మరి.